అగళి మండల కేంద్రంలో సోమవారం, హైందవి ఆధ్వర్యంలో గీత జయంతి సందర్భంగా సామూహిక భగవద్గీత పారాయణం జరిగింది. ఈ సందర్భంగా, శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీతలోని 100 శ్లోకాలను తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో అర్థాలతో సహా యువతకు అందించే ప్రయత్నం గురించి వక్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో హైందవి సంస్థ ప్రతినిధులతో పాటు, విశ్రాంత బ్యాంక్ మేనేజర్, కళాశాల ఉపన్యాసకులు, ప్రిన్సిపాల్, ట్రస్టీ సభ్యులు పాల్గొన్నారు.