గుడిబండ మండలంలోని జర్నలిస్టులు తహశీల్దార్ కళ్యాణ్ చక్రవర్తికి వినతిపత్రం అందజేశారు. పలమనేరు నియోజకవర్గం వీకోట మండల ఆంధ్రజ్యోతి విలేకరిపై ఇటీవల జరిగిన దాడిని వారు తీవ్రంగా ఖండించారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచే మీడియా ప్రతినిధులపై దాడులు జరగడం ప్రజాస్వామ్యానికి ముప్పు అని, ఇది కేవలం వ్యక్తిగత దాడి మాత్రమే కాదని, సమాజం మొత్తం స్వేచ్ఛా హక్కులపై దాడి అని జర్నలిస్టులు పేర్కొన్నారు. నిందితులను తక్షణమే అరెస్టు చేసి, చట్టపరంగా కఠినంగా శిక్షించాలని వారు వినతిపత్రంలో కోరారు.