గుడిబండ: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ తప్పు

శుక్రవారం గుడిబండ మండలం మోపురుగుండు గ్రామంలో వైకాపా నేతలు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మడకశిర ఇన్చార్జ్ ఈర లక్కప్ప మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే నిర్ణయాన్ని అడ్డుకుంటామని తెలిపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల ప్రజలకు కలిగే నష్టాలను వివరిస్తూ సంతకాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్