మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆదివారం మడకశిర పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి కార్యకర్తలు, సామాన్య ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను, అర్జీలను ఎమ్మెల్యేకు సమర్పించారు. వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.