ప్రతి ఉద్యోగికి జీవితంలో పదవీ విరమణ ఎంతో ముఖ్యమైనదని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామి అన్నారు. గురువారం మడకశిర మండలం గుండుమల గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణమూర్తి పదవీ విరమణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఉపాధ్యాయుడిగా ఎంతోమంది విద్యార్థులను ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులు కృష్ణమూర్తి ప్రధానోపాధ్యాయుడిగా పదవీ విరమణ చేయడం గుర్తుండిపోయే క్షణాలన్నారు.