మడకశిర ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదుట శుక్రవారం ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ఈరేష్ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలపై ప్రభుత్వానికి సవతి ప్రేమ చూపిస్తుందని ఎస్ఎఫ్ఐ నాయకులు అన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు ప్రభుత్వం పరోక్షంగా మద్దతు ఇస్తోందని ఆరోపించారు. డిగ్రిలో డబుల్ మేజర్ విధానాన్ని కొనసాగించాలని, అడ్మిషన్ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.