మడకశిర మండలం గౌడనహళ్లి పంచాయతీ తురకవాండ్లపల్లికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు కురుబ చిరంజీవి వారం రోజుల క్రితం తన పొలంలో కాలుజారి గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం గ్రామానికి వచ్చిన చిరంజీవిని గురువారం జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు నరసింహమూర్తి నియోజకవర్గ వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు శేషాద్రి తో పాటు సీనియర్ నాయకులు రంగనాథ్, రవి కుమార్, వార్డు నాయకులు తిప్పన్న తదితరులు పరామర్శించారు.