మడకశిర: మత గ్రంథాలను కించపరచలేదన్న ఎమ్మెస్ రాజు

మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు ఇటీవల ఒక సమావేశంలో మాట్లాడుతూ, భగవద్గీత, ఖురాన్, బైబిల్ వంటి మత గ్రంథాల వల్ల జీవన ప్రమాణాలు మెరుగుపడలేదని, కేవలం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే మెరుగుపడ్డాయని అన్నారు. దీనిపై వైకాపా సోషల్ మీడియాలో మత గ్రంథాలను అవమానించారని విమర్శలు రావడంతో, ఎమ్మెస్ రాజు గురువారం స్పందించి తాను ఎక్కడా మత గ్రంథాలను కించపరచలేదని, ఎవరైనా బాధపడి ఉంటే క్షమించమని కోరారు.

సంబంధిత పోస్ట్