మడకశిర ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్న బివి నరసింహులు పదవీ విరమణ కార్యక్రమం శుక్రవారం డిపో ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్సార్సీపీ సంయుక్త కార్యదర్శి వై ఎన్ రవి శేఖర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఆనంద రంగారెడ్డి, మాజీ సర్పంచ్, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. దశాబ్దాలుగా ఎంతోమందిని సురక్షితంగా గమ్యాలకు చేర్చిన నరసింహులు సేవలను కొనియాడారు. అనంతరం ఆయనను పూలమాలలతో సన్మానించారు.