ఎలుగుబంటి దాడిలో గాయపడిన వ్యక్తి

రోళ్ల మండలం కొడగార్లగుట్టలో పొలంలో నీరు పారించేందుకు వెళ్లిన యువకుడు ముద్ద రాజుపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ దాడిలో ముద్ద రాజు తల, ముఖం, వీపు, ఎడమ చేతిపై తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్థులు అతన్ని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో ఎలుగుబంట్ల సంచారంపై రైతులు ఆందోళన చెందుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్