సంక్రాంతి పండుగ నేపథ్యంలో కోడి పందేలపై పోలీసులు నిఘా పెంచారు. ఈ క్రమంలో, గురువారం రొళ్ల మండలం గిరి నాయకనపాళెం గ్రామ శివారులో కోడి పందేలు జరుగుతున్నాయన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు పందెం రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 520 నగదు, 4 బైకులు, 3 పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.