రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శిగా రామిరెడ్డి

మడకశిర మండలం చందకచెర్ల గ్రామానికి చెందిన వైయస్సార్సీపి మాజీ మండల కన్వీనర్ రామిరెడ్డిని వైసీపీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శిగా అధిష్టానం నియమించింది. శుక్రవారం రామిరెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో రైతు విభాగం కార్యదర్శిగా నియమించినందుకు వైయస్ జగన్మోహన్ రెడ్డికి, జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ విజయం కోసం కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్