కూటమి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి వివిధ పార్టీల నుండి తెలుగుదేశం లోకి చేరుతున్నారని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. శనివారం మడకశిర నియోజకవర్గం రోల్ల మండల కేంద్రంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పది కుటుంబాలు వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలో చేరాయి. వీరందరికీ ఎమ్మెల్యే కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి టీడీపీలోకి వస్తున్నట్లు వారు తెలిపారు.