ఆదివారం మడకశిరలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు పాల్గొని జెండా ఆవిష్కరించి, ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ గొప్ప వ్యక్తి అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.