టీడీపీ నాయకుడికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్ష పదవి

అగళి మండలం మధుడి గొల్లహట్టి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కెంచు యాదవ్, బుధవారం అమరావతిలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా రాష్ట్ర బీసీ నాయకులు కృష్ణయ్య చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఇప్పటికే ఆయన భార్య శిల్ప మడకశిర మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గా ఉన్నారు. ఈ నియామకం పట్ల మడకశిర నియోజకవర్గ టీడీపీ నాయకులు యాదవ్ కు అభినందనలు తెలిపారు. ప్రభుత్వం బీసీలకు అందించే సంక్షేమ పథకాలతో అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని యాదవ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్