మండల కేంద్రం అగళి బస్టాండ్ లో ఆదివారం సాయంత్రం స్థానిక టీడీపీ నాయకులు, మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు తల్లిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన దిష్టిబొమ్మను దహనం చేసి, అనంతరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఉమేష్, సింగల్ విండో అధ్యక్షులు కుమారుస్వామి, కన్వీనర్ తిప్పేస్వామి, డైరెక్టర్లు కెంచు, శివరాం, ఆర్గనైజేషన్ సెక్రటరీ శ్రీనివాసులు పాల్గొన్నారు.