మడకశిరలో కేబుల్ వైర్ చోరీ చేసిన దొంగలు

శుక్రవారం రాత్రి మడకశిర పట్టణం డ్రైవర్ కాలనీలో తాగునీటి బోరుకు సంబంధించిన స్టార్టర్ కేబుల్ వైర్లను గుర్తుతెలియని దుండగులు దొంగిలించారు. దీనితో కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి కొత్త కేబుల్ వైర్లు వేయించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. పట్టణంలో రాత్రిపూట బోరు వైర్లను దొంగిలించే ముఠాలపై పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా పెట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనతో పట్టణంలో భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్