మడకశిర పట్టణంలోని అంగన్వాడీ ఉద్యోగులకు 'పోషణ్ భి పడాయి భి'పై గురువారం శిక్షణ ఇచ్చారు. పట్టణంలోని సాయి నగర్ లోని ఎనిమిదవ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అందించే పౌష్టికాహారం, శిక్షణ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఈ శిక్షణ ద్వారా అంగన్వాడీ కార్యకర్తలు పిల్లల ఎదుగుదలకు అవసరమైన పోషకాహారం, విద్యపై మరింత మెరుగ్గా శిక్షణ ఇవ్వగలరు.