మడకశిర పట్టణంలో ఏబీఎన్ రాధాకృష్ణకు వ్యతిరేకంగా వైకాపా కార్యకర్తలు, నాయకులు నిరసన ర్యాలీ గురువారం నిర్వహించారు. 'డౌన్ డౌన్ ఏబీఎన్ రాధాకృష్ణ' అంటూ నినాదాలు చేస్తూ పట్టణంలో ర్యాలీగా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా ఇన్చార్జ్ లక్కప్పతో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.