పన్నెండవ పిఆర్సీ కమీషన్ ను నియమించాలి.. ఏపీఎస్టీఏ

ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి పన్నెండవ వేతన సంఘాన్ని (పిఆర్పీ) నియమించి, వెంటనే ముప్పై శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కాడిశెట్టి శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన రాంపురం, కురుబవాండ్లపల్లి, మునిమడుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, వెంకటరెడ్డిపల్లి, శెట్టిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలు, గుట్టూరు, మరవపల్లి, కొండంపల్లి, హనమపల్లి తదితర ప్రాథమిక పాఠశాలలను సందర్శించి, ఉపాధ్యాయుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్