రైతు పక్షపాతి చంద్రబాబు నాయుడు...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టు రైతులకు విస్తృత స్థాయిలో సబ్సిడీతో కూడిన పరికరాలను అందజేస్తోందని, రైతు పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని మంత్రి సవిత తెలిపారు. గురువారం పెనుకొండ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో పట్టు రైతులకు సబ్సిడీతో కూడిన పట్టు పరిశ్రమ పరికరాలను మంత్రి సవిత పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి రైతులతో మాట్లాడుతూ సబ్సిడీ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పరికరాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్