మాజీ మంత్రి ఉషశ్రీ పైమండిపడ్డ కూటమి నాయకులు...

బుధవారం టీడీపీ కార్యాలయంలో టీడీపీ మండల కన్వీనర్ బాలకృష్ణ చౌదరి ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీపై కూటమి నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. గోరంట్ల చెరువు పరిశీలన పేరుతో ఉషశ్రీ షో చేశారని, తప్ప చేసింది ఏమీ లేదని ఆరోపించారు. గోరంట్లలో షో చేసి పెనుకొండలో భూమి పూజ చేసిన ఆమె, పెనుకొండలో హైవే పక్కన గుంతలతో కూడిన స్థలాన్ని కొనుగోలు చేశారని, ఆ గుంతలకు ఏ రైతు పేరు మీద అనుమతి తీసుకొని మట్టి తవ్వారో చెప్పాలని ప్రశ్నించారు. గోరంట్ల రైతులకు ఒక న్యాయం, ఉషశ్రీకి ఒక న్యాయమా అని నిలదీశారు.

సంబంధిత పోస్ట్