భార్యతో ఎమ్మార్వో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని కలెక్టర్ కు ఫిర్యాదు

శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్‌కు ఓ వ్యక్తి సోమందేపల్లి తహశీల్దార్‌పై ఫిర్యాదు చేశారు. భూ సమస్య పరిష్కారం కోసం వెళ్లిన తన భార్యతో తహశీల్దార్ వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తున్న తన భార్యను కార్యాలయం చుట్టూ తిప్పుకుని, మాయమాటలతో వశపరచుకున్నారని బాధితుడు కన్నీటిపర్యంతమయ్యారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన కలెక్టర్ విచారణకు ఆదేశించారు.

సంబంధిత పోస్ట్