పిఆర్సీ కమీషన్ ను నియమించకపోవడంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆర్థికంగా నష్టపోతున్నారని స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కాడిశెట్టి శ్రీనివాసులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు యం. వి. కృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం చోళేమర్రి, పెద్దమంతూరు, దొడగట్ట, పెద్దగువ్వలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే మూడు డిఎ లు పెండింగ్ లో వున్నాయని, జనవరి నుండి మరోక డిఎ ఇవ్వాల్సి వుంటుందని తెలిపారు.