గాంధీ వర్ధంతి: టీడీపీ నాయకుల నివాళులు

గోరంట్లలో శుక్రవారం మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా, టీడీపీ నాయకులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ విద్యాధరణి మాట్లాడుతూ, సత్యం, అహింసా మార్గాలనే ఆయుధంగా చేసుకుని దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుడు గాంధీ అని కొనియాడారు. జాతి సమగ్రత, ఐక్యతను నిలబెట్టేందుకు ఆయన అనుసరించిన మార్గం అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్