పరిగి మండలంలోని పెద్దిరెడ్డిపల్లి గ్రామంలో గురువారం శ్రీవరసిద్ధి వినాయక విగ్రహం, వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాలలో మంత్రి సవిత పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పరిగి మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.