శుక్రవారం అనంతపురం జిల్లా గుత్తి పట్టణ కేంద్రంలో మంత్రి సవిత బీసీ వెల్ఫేర్ అధికారి కుష్బూ కొఠారితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, జిల్లాలోని బీసీ హాస్టళ్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. హాస్టళ్లలో నివసిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన ఫుడ్ మెనూ ప్రకారం నాణ్యమైన, శుభ్రమైన భోజనం తప్పనిసరిగా అందించాలని స్పష్టం చేశారు.