మునిగిపోయే రాజధాని కోసం ప్రతి మంగళవారం అప్పులవారంగా మారుస్తున్నారని ప్రభుత్వంపై మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ విమర్శలు చేశారు. ఆదివారం పెనుకొండ వైకాపా కార్యాలయంలో మాట్లాడుతూ, వైయస్ జగన్మోహన్ రెడ్డి గతంలో విశాఖపట్నం కర్నూలు రాజధాని గురించి చెప్తే టీడీపీ అభ్యంతరం చెప్పిందన్నారు. కమిషన్ల కోసమే గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ రాజధాని అంశాన్ని రిజెక్ట్ చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.