కాపులకు జగన్ తీరని ద్రోహం చేశారు.. మంత్రి సవిత

2019 ఎన్నికల ముందు కాపులను ఓటు బ్యాంకుగా వాడుకుని, వారిని మోసం చేశారని మంత్రి సవిత గురువారం పెనుకొండలో మీడియాతో అన్నారు. కాకిలాగా ఊరూరూ తిరుగుతూ కాపులకు మేలు చేస్తానని చెప్పి వారి ఓట్లను దండుకుని నమ్మకద్రోహానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. బీసీలను కూడా ఓటు బ్యాంకుగా వాడుకుని ద్రోహం చేశారని, అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీ, కాపు, బీసీలపై తప్పుడు కేసులు బనాయించి వేధింపులకు గురిచేశారని మంత్రి సవిత మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్