నేతన్న నేస్తం ఇచ్చి నేతన్నలకు అండగా నిలిచిన నాయకుడు జగన్...

మాజీ వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా, జగనన్న ప్రభుత్వంలో నేతన్నలకు ప్రతి ఏడాది 24 వేల రూపాయలు వైయస్సార్ నేతన్న నేస్తం అందించి, అండగా నిలిచిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. శుక్రవారం సోమందేపల్లిలో చేనేత కార్మికులకు అండగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వాగ్దానం చేసిన మేరకు ప్రతి సంవత్సరం 25 వేల రూపాయల ఆర్థిక సహకారం, నేతన్నలందరికీ చేనేత ఉపవృత్తుల కార్మికులకు కూడా జాప్యం లేకుండా విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్