రాష్ట్ర బీసీ సంక్షేమ, జౌళి, చేనేత శాఖామంత్రి సవిత, లేపాక్షి షోరూంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త అందించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో లేపాక్షి షోరూంలలో 60 కోట్ల వ్యాపారం జరిగినందున, ఉద్యోగుల జీతాలను 10% పెంచుతున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ నిర్ణయంతో సంతోషించిన ఉద్యోగులు, తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.