రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆదివారం గోరంట్ల మండలం వడిగేపల్లి పంచాయతీ గొల్లపల్లి గ్రామం నుండి బెంగళూరు అనంతపురం జాతీయ రహదారిని కలుపుతూ నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులను పరిశీలించారు. కోటి రూపాయల నిధులతో ఈ రోడ్డు నిర్మాణం జరుగుతోందని మంత్రి తెలిపారు. రోడ్డు నిర్మాణ నాణ్యతలో రాజీ పడకుండా పనులు చేపట్టాలని కాంట్రాక్టర్లకు ఆమె ఆదేశాలు జారీ చేశారు. ఈ పర్యటనలో మంత్రి వెంట కూటమి నాయకులు కూడా పాల్గొన్నారు.