సోమందేపల్లి మండలం నాగినాయన చెరువు గ్రామంలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్టు భూమి పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొన్నారు. రెవెన్యూ సమస్యలకు తక్షణ పరిష్కారాలు చూపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆమె తెలిపారు. గత ప్రభుత్వ అసమర్థ పాలన, రీ సర్వే లోపాలు వల్ల భూ సమస్యలపై అర్జీలు ఎక్కువగా వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో 31,368 మంది రైతులకు నూతన పాస్ బుక్ లు అందజేస్తున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, రెవిన్యూ అధికారులు, నాయకులు పాల్గొన్నారు.