పల్స్ పోలియోలో పాల్గొన్న మంత్రి సవిత

విజయవాడలోని మధురానగర్ లో ఆదివారం జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుతో కలిసి ఆమె చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించి వారి జీవితాలను ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాలని మంత్రి పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్