కర్ణాటక రాష్ట్ర మాజీ మంత్రి, పావగడ మాజీ శాసనసభ్యులు వెంకట రమణప్ప రెండు రోజుల క్రితం మరణించారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతూ, ఆదివారం మంత్రి సవిత పావగడ తాలూకా హనుమంతనహళ్లి గ్రామంలోని వెంకటరమణప్ప ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం, ఆయన కుటుంబ సభ్యులను మంత్రి సవిత పరామర్శించారు.