రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మంగళవారం మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహానాడు ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు తో కలిసి ఆమె మహానాడు ఏర్పాట్లపై చర్చించారు. రేపు, ఎల్లుండి వర్చువల్ విధానంలో మహానాడు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.