మాజీ మంత్రి అంబటి రాంబాబు పై ఎంపీ బీ. కె. పార్థసారథి ఫైర్...

హిందూపురం ఎంపీ బీ. కె. పార్థసారథి, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. శనివారం అనంతపురంలోని తన కార్యాలయంలో మాట్లాడుతూ, అంబటి రాంబాబు సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడుతున్నారని, ఇది బావ్యమా అని ప్రశ్నించారు. మీ నాయకుని అలవాట్లే మీకు వచ్చాయని, వయసు పెరిగినా బుద్ధి పెరగలేదని, ఇంకా అధికారంలో ఉన్నామని భ్రమలో మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రజలు మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా లేకుండా చేశారని, అయినా మీకు బుద్ధి రాలేదన్నారు. వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్