పరిగి: ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన మంత్రి సవిత

పరిగి మండలం ధనాపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం మంత్రి సవిత తనిఖీ చేశారు. ఈ సందర్బంగా విద్యార్థులతో కలిసి మంత్రి సవిత మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులతో భోజనం బాగుందా అని ఉపాధ్యాయులు అర్థమయ్యేలా బోధిస్తున్నారా అని, ప్రభుత్వం అందించిన యూనిఫామ్, కిట్స్, బుక్స్, అన్ని మీకు అందాయా అని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్