పెనుకొండ: సమ్మె నోటీసును అందజేసిన ఏఐటీయూసీ నాయకులు...

పెనుకొండ పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయం వద్ద మేనేజర్ కు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమ్మె నోటీసు ఇవ్వబడింది. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా, కార్మిక సంఘాలు ఫిబ్రవరి 12న తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు మల్లికార్జున, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అసోసియేషన్ నాయకులు కరణ్, వినోద్, మహేష్, గజేంద్ర, నరసింహులు, బావక్క, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్