సీఎం చంద్రబాబు రాక కోసం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి మంత్రి ఎస్. సవిత తెలిపారు. గురువారం జమ్మలమడుగులోని ఓ రిసార్టులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సీఎం పర్యటన సందర్భంగా ఎన్టీఆర్ భరోసా పథకం సామాజిక పెన్షన్ల పంపిణీ, పీ-4 కార్యక్రమంతో పాటు టీడీపీ క్యాడర్ తోనూ సమావేశం కానున్నారని తెలిపారు. రూ. 165 కోట్ల విలువైన పర్యాటక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.