అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ద్యేయం అని మంత్రి సవిత పేర్కొన్నారు. గురువారం పెనుకొండ మున్సిపాలిటీ పరిధిలోని వెంకటరెడ్డి పల్లి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు గురించి, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.