పెనుకొండ నగర పంచాయతీ పరిధిలోని వెంకటరెడ్డిపల్లి 3వ వార్డు టీడీపీ కౌన్సిలర్ గిరి ఆధ్వర్యంలో 10 మంది చిరు వ్యాపారస్తులకు తోపుడు బండ్లను ఉచితంగా అందించారు. వాటిని మంత్రి సవిత చేతుల మీదుగా చిరు వ్యాపారస్తులకు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కౌన్సిలర్ గిరి చిరు వ్యాపారస్తులకు చేయూత నివ్వడం అభినందించదగ్గ విషయం అన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.