పెనుకొండ పట్టణంలో స్థానిక ఎన్టీఆర్ కాలనీలో శుక్రవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లు బిగించరాదని, విద్యుత్ సర్దుబాటు చార్జీలు తగ్గించాలని కోరుతూ నాయకులు కరపత్రాలను ప్రజలకు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు హరి, బాబావలి, తిప్పన్న, హబీబ్, కాలనీ వాసులు పవన్, భాష, తదితరులు పాల్గొన్నారు.