పెనుకొండ: బాబయ్య దర్గా కు చాదర్ ను సమర్పించిన మంత్రి, కలెక్టర్

పెనుకొండ బాబయ్య స్వామి దర్గాలో మంగళవారం రాత్రి జరిగిన బాబాఫక్రోద్దీన్ 753వ గంధం మహోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి సవితమ్మ చాదర్ సమర్పించారు. ఆమెతో పాటు జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా కూడా చాదర్ సమర్పించారు. ఈ సందర్భంగా దర్గా వంశ పారంపర్య పీఠాధిపతి తాజ్ బాబా మంత్రి సవితమ్మకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, ముస్లిం, మైనారిటీలు, ఫకీర్లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్