పెనుకొండ: నాయకులు, కార్యకర్తలతో మంత్రి సవిత సమావేశం...

పెనుకొండ పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో మంగళవారం, మంత్రి సవితమ్మ సోమందేపల్లి మండలంలోని నాగినాయన చెరువు పంచాయతీ, గుడిపల్లి, తుంగోడు పంచాయతీలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పంచాయతీలలో జరిగిన అభివృద్ధి, భవిష్యత్తులో చేపట్టబోయే పనులపై చర్చించారు. చిన్న సమస్యలను నాయకులే పరిష్కరించుకోవాలని, పరిష్కారం కాకపోతే తన వద్దకు తీసుకురావాలని సూచించారు. పంచాయతీ నాయకులంతా కలిసికట్టుగా ఉండాలని మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్