పెనుకొండ పట్టణంలో శుక్రవారం 37వ రోడ్డు భద్రత వారోత్సవాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు వై జంక్షన్ నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించబడుతుంది. ఈ ర్యాలీలో పాల్గొనేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో కోరింది. నియోజకవర్గంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని సూచించారు.