పెనుకొండ: ముగ్గుల పోటీలను సద్వినియోగం చేసుకోండి... మంత్రి సవిత

మంత్రి సవిత మహిళలకు ముగ్గుల పోటీలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. శనివారం పెనుకొండ పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో ముత్యాల ముగ్గుల పోటీ కరపత్రాలను విడుదల చేశారు. పెనుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ పోటీలు ఈ నెల 14వ తేదీ బుధవారం ఉదయం 9 గంటలకు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్