పెనుకొండ నగర పంచాయతీ పరిధిలోని 4వ వార్డు 153వ బూత్ లో మంగళవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమలో భాగంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా కూటమి నాయకులు ఇంటింటికీ వెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాల యొక్క కరపత్రాలు పంచి పెట్టారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల అభిప్రాయాలను అడిగారు.