పుట్టపర్తిలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మావేశంలో గురువారం పెనుకొండకు చెందిన విశ్వహిందూ పరిషత్ నాయకులు వేద వ్యాస్ బీజేపీ లోకి చేరారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు జి. ఎం. శేఖర్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ వేద వ్యాస్ కు పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయనతో 120మంది పార్టీలోకి చేరారు. అయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.