పెనుకొండ మండలం గుట్టూరులో వైసీపీ సీనియర్ నాయకుడు కురుబ ఆంజనేయులు గుండెపోటుతో గురువారం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ గుట్టూరు గ్రామానికి వెళ్లి ఆంజనేయులు మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు పొగాకు రామచంద్ర, సుధాకర్ రెడ్డి, నరసింహ తదితరులు పాల్గొన్నారు.